RCB vs GT: బెంగళూరు జోరుకు బ్రేకులు వేసిన గుజరాత్... తొలి ఓటమిని చవిచూసిన ఆర్సీబీ.! 2 d ago

featured-image

IPL 2025లో భాగంగా చిన్నస్వామి వేదికగా 14వ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)...గుజరాత్ టైటాన్స్ (GT) ముఖాముఖీ తలపడ్డాయి. అయితే ఈ మ్యాచ్‌లో RCB హోం గ్రౌండ్‌లో ఘోరపరాజయం చవిచూసింది.

గుజరాత్ పై RCB కి పైచెయ్యి ఉన్నప్పటికీ.. సిరాజ్ మియా తన అద్భుత బౌలింగ్ స్పెల్ తో.. GT కి విజయాన్ని అందించాడు. GT 8 వికెట్ల తేడాతో RCB ని చిత్తుగా ఓడించింది. దీంతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న RCB.. మూడో స్థానానికి పడిపోయింది. ఈ విజయంతో GT ఒకమెట్టు పైకి ఎక్కి 4వ స్థానంలో నిలిచింది. 


తొలుత టాస్ గెలిచి గుజరాత్ కెప్టెన్ శుభమన్ గిల్.. RCB ను బ్యాటింగ్ కు ఆహ్వానించాడు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరుకు ఆదిలోనే షాక్ తగిలింది. కగిసో రబాడా ప్లేసులో జట్టులోకి వచ్చిన అర్షద్ ఖాన్ తాను వేసిన‌ మొదటి ఓవర్లోనే విరాట్ కోహ్లీ (7) వికెట్ తీసి పెద్ద షాక్ ఇచ్చాడు. హోం గ్రౌండ్‌లో భారీ ఇన్నింగ్స్ ఆడతాడనుకున్న కోహ్లీ.. ఇలా తక్కువ స్కోర్‌కు పెవిలియన్ చేరడం ఫ్యాన్స్‌కు ఏమాత్రం నచ్చలేదు.


ఆ తర్వాత వచ్చిన దేవ్‌దత్ పడిక్కల్‌ను (4) సిరాజ్ క్లీన్‌బౌల్డ్‌ చేశాడు. ఆ వెంటనే ఫిలిప్‌ సాల్ట్‌ను (14) కూడా అదే విధంగా సిరాజ్ పెవిలియన్‌కు పంపించాడు. దీంతో పవర్ ప్లే లోనే RCB కి అడ్డుకట్ట పడింది. వరుసగా రెండు కీలక వికెట్లు పడటంతో బెంగళూరు జట్టుకు పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. టీం కష్టకాలంలో ఉన్నప్పుడు బ‌రిలోకి వచ్చిన కెప్టెన్ రజత్ పాటిదార్ (12) తక్కువ స్కోరుకే వెనుతిరిగాడు.


ఇక వన్-సైడ్ అయిపోయిందనుకున్న మ్యాచ్‌ను లియామ్ లివింగ్‌స్టోన్.. జితేష్ శర్మ 52 పరుగుల భాగస్వామ్యంతో జట్టును ఆదుకున్నారు. లియామ్ లివింగ్‌స్టోన్ (54) అర్ధ సెంచరీతో టీం కి ఊపిరి పోయగా.. జితేష్ శర్మ 33 పరుగులతో స్కోర్ పెంచేందుకు చెయ్యందించాడు. ఇక చివరిలో టిమ్ డేవిడ్ 18 బంతుల్లో 32 పరుగులు చేసి…. టీం కు డిఫెండింగ్ స్కోరును అందించాడు. దీంతో RCB 8 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. 


ఇక ఈ మ్యాచ్‌లో గుజరాత్‌ టైటాన్స్ బౌలర్‌ మహమ్మద్ సిరాజ్ అదరగొట్టాడు. 4 ఓవర్లు... కేవలం 19 రన్స్ మాత్రమే ఇచ్చి మూడు కీలక వికెట్లు తీశాడు. సాయి కిషోర్ 2 వికెట్లు పడగొట్టాడు. అర్షద్ ఖాన్, ప్రసిద్ధ్ కృష్ణ, ఇషాంత్ శర్మ ఒక్కో వికెట్ తీశారు. GT మెయిన్ బౌలర్ రషీద్ ఖాన్ కు ఒక్క వికెట్ కూడా పడలేదు.


తక్కువ పరుగులే లక్ష్యంతో బరిలోకి దిగిన GT ఓపెనర్లు పవర్ ప్లే లో తడపడ్డారు. భువి కెప్టెన్ గిల్ ను (14) తక్కువ పరుగులకే పెవిలియన్ పంపాడు. ఓ దశలో GT మ్యాచ్ గెలవడం కష్టమే అనుకున్న సమయంలో సాయి సుదర్శన్.. జోస్ బట్లర్ అద్భుతంగా ఆడి.. 75 పరుగుల భాగస్వామ్యంతో జట్టుకు విజయాన్ని ఖరారు చేశారు.

సాయి సుదర్శన్ (49) తన క్లాస్సి ఫార్మ్ ను కంటిన్యూ చేసాడు.. కానీ తన హాఫ్ సెంచరీ కి ఒక్క పరుగు దూరంలో హేజిల్‌వుడ్ కు వికెట్ ఇచ్చి వెనుతిరిగాడు.


వికెట్ పడినా కానీ.. ఈపాటికే చాల ఆలస్యం అయిపోయింది. గడిచిన రెండు మ్యాచ్లలో పెద్దగా రాణించలేకపోయిన జోస్ బట్లర్.. ఈ మ్యాచ్‌లో విరుచుకుపడ్డాడు. 39 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్స్‌లు కొట్టి 73 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. ఇంపాక్ట్ ప్లేయర్ గా వచ్చిన షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్ (30) మ్యాచ్‌ను త్వరగా ముగించాలని లక్యంగా పెట్టుకున్నాడు.. సిక్స్‌తో గుజరాత్ కు విజయాన్ని అందించాడు. 2 వికెట్ల నష్టానికి …. 17.5 ఓవర్లలోనే 170 పరుగులు చేసి లక్ష్యాన్ని చేధించారు. 


వరుసగా గెలుచుకుంటూ వెళ్లిన బెంగుళూరు జోరుకు.. గుజరాత్ బ్రేకులు వేసింది. దీంతో ఈ టోర్నీలో తొలి ఓటమిని నమోదు చేసింది. ఈ మ్యాచ్‌లో GT బౌలర్లు, బ్యాటర్లు బాగా రాణించారు. అద్భుతంగా బౌలింగ్ వేసిన సిరాజ్ మియా మాన్ ఆఫ్‌ ది మ్యాచ్ గా నిలిచాడు.


టోర్నీలో భాగంగా ఈరోజు మరో ఉత్కంఠభరితమైన మ్యాచ్ జరగనుంది. ఈడెన్ గార్డెన్స్ లో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) మరియు సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) మధ్య పోరు జరగనుంది. ఈ మ్యాచ్ రాత్రి 7:30 PM ISTకు ప్రారంభంకానుంది.


Related News

Related News

  

Copyright © 2025 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD